టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫిల్మ్ నగర్ కి షిఫ్ట్ అయ్యారు. ఇటీవల ఫిల్మ్ నగర్ లో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేశారు. తన ఫ్యామిలీ, కొందరు సన్నిహితులతో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్లారు విజయ్ దేవరకొండ.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ఇంటి గురించి చర్చ మొదలైంది. ఈ ఇంటి కోసం విజయ్ దేవరకొండ ఎంత ఖర్చు పెట్టి ఉంటారనే విషయంపై కొంత క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. ఎంతో విశాలంగా నిర్మించుకున్న ఈ ఇంటి కోసం విజయ్ దేవరకొండ రూ.20 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

కేవలం రెండు, మూడు సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం ఒక్కో సినిమాకి పది కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. పైగా సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. వాణిజ్య ప్రకటనలు అదనం. ఈ లెక్కన చూసుకుంటే విజయ్ కి ఇరవై కోట్లు పెద్ద లెక్క కాదనే చెప్పాలి.  

సినిమాల విషయానికొస్తే.. 'గీత గోవిందం' సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ హీరోకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తన సినిమాలను ఇతర  భాషల్లో కూడా రిలీజ్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటీవల దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదలైన 'డియర్ కామ్రేడ్' సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

దీంతో ప్రస్తుతం తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ లాంటి హీరోయిన్లు నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన తరువాత విజయ్..  దర్శకుడు  పూరి జగన్నాథ్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.