ఆస్కార్ నామినేట్ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ ద‌ర్శక‌త్వంలో జాక్విన్ పోనిక్స్ ప్రధాన పాత్రధారిగా తెర‌కెక్కిన చిత్రం జోక‌ర్. ఈ చిత్ర రీసెంట్ గా విడుద‌లై రికార్డ్ లను బ్రేక్ చేస్తోంది.  హాస్యనటుడు ఆర్థర్ ఫ్లేక్ యొక్క ట్విస్టెడ్ కథ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో  ఆర్థర్ ఫ్లేక్ పాత్రలో జాక్విన్ అద్బుతంగా న‌టించారు. జోక‌ర్‌గా ఆయ‌న న‌ట‌న అద్భుతంగా సాగింది.

read also:మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

 అక్టోబర్ 2న విడుదలై భారీ వసూళ్లతో ప్రపంచ సినిమా బాక్సాఫీసును షేక్ చేసి  అరుదైన ఘనతను సాధించింది.  బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.71,63,50,00,000 కోట్లు) వసూలు చేసిన మొట్టమొదటి చిత్రంగా ఆర్-రేట్‌ను సంపాదించుకుంది.  ఈ చిత్రం భారతదేశంలో కూడా అధికా వసూళ్లను సాధించింది. వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిల్మ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ బహుమతి గెలుచుకుంది.

785 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి రికార్డ్ నెలకొల్పిన ర్యాన్ రేడోల్స్ ‘డెడ్‌పూల్-2’ చిత్రం రికార్డును ‘జోకర్’ బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు తెరలేపింది. సినిమాలోని దృశ్యాలు హింసాత్మకంగా ఉన్నాయంటూ అనేక విమర్శలు వచ్చాయి.

హింసాత్మక సినిమా అని దీనిని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. చిత్రంలోని ప్రధాన పాత్రధాని జాక్విన్ ఫీనిక్స్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు.  రాబ‌ర్ట్ ఫోనిక్స్,జాజీ బీట్జ్, ఫ్రాన్సెస్ కోన్రాయ్, మార్క్ మారోన్, బిల్ క్యాంప్‌, గ్లెన్ ఫ్లెష్ల‌ర్‌, షియా విగమ్, బ్రెట్ క‌ల్లెన్‌, డ‌గ్ల‌స్ హోడ్జ్‌, జోష్ పారిస్ ముఖ్య పాత్రల‌లో న‌టించారు.