ప్రపంచంలోకెల్లా అత్యధిక ఆదరణ పొందిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్ లో మొదలైంది. సోమవారం నాడు జరిగిన 92వ ఆస్కార్ సెలబ్రేషన్స్ లో ప్రముఖ నటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ అవార్డ్స్ లో 'జోకర్' సినిమాకి అవార్డులు దక్కాయి.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన 'జోకర్' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జాక్విన్ ఫోనిక్స్ కి ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. చాలా సులువుగా ప్రాణాలు తీసే కామిక్ క్యారెక్టర్ 'జోకర్' ఈ పాత్రలో జాక్విన్ ఫోనిక్స్ ఇమిడిపోయి నటించాడు.

ఆస్కార్ 2020: మరోసారి విన్నర్ గా నిలిచిన టాయ్ స్టోరీ(4)

ఆయన నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అందుకే అతన్ని గోల్డెన్ గ్లోబ్ ఇంతకుముందు వరించగా.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించిన ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టుకుంది. 

మిగిలిన అవార్డులు లిస్ట్.. 

ఉత్తమ నటి : రెనీ జెల్ వెగర్ (జూడీ)

ఉత్తమ దర్శకుడు : పారాసైట్ (బోన్ జోన్ హో)

ఉత్తమ సంగీతం : జోకర్ (హిల్దార్)

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : పారాసైట్ 

ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917 (రోజర్ డికెన్స్)

బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాప్ స్టోరీ 4

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)

బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌

ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)

ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ

ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు: బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌) 

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)