ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ తాను ఎదుర్కొన్న ఓ సంఘటనని బయటపెట్టింది. ఓ దర్శకుడు తనను ప్రవర్తించిన తీరు గురించి చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల హాలీవుడ్ నటులు స్కార్లెట్ జొహాన్సన్,లుపితా న్యోంగ్, అవ్క్వఫినా, లారా డేర్న్, రెనీ జేల్ల్వేగేర్ లతో కలిసి ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓ డైరెక్టర్ తనను షర్ట్ విప్పి చూపించమన్న విషయాన్ని బయటపెట్టింది జెన్నిఫర్. ఆ సమయంలో తను న్యూడ్ సన్నివేశాల్లో నటించాల్సివుందని.. కానీ డైరెక్టర్ సెట్స్ లో కాకుండా ఆఫ్ ది స్క్రీన్ షర్ట్ విప్పమని, తన వక్షోజాలు చూస్తానని చెప్పినట్లు వెల్లడించింది.

ఇన్‌కం ట్యాక్స్‌ రైడ్స్‌ నా మీద జరిగుంటే..? హీరో నవదీప్ కామెంట్స్!

ఆ సమయంలో డైరెక్టర్ చెప్పిన పని చేయలేదని.. కుదరదని అతడి ముఖం మీదే చెప్పానని.. ఆ సమయంలో నాకు నేను సపోర్ట్ గా నిలిచానని చెప్పుకొచ్చింది జెన్నిఫర్. ఆ సమయంలో కాస్త భయం కూడా వేసిందని తెలిపింది.

తనతో పాటు ఆ రూమ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉందని.. ఆ డైరెక్టర్ తనతో అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే ఆమె వింటూనే ఉందని.. తెలిపింది. ఆ తరువాత దర్శకుడు రియలైజ్ అయ్యి తనను క్షమాపణలు కోరినట్లు గుర్తు చేసుకుంది.

ఆ సమయంలో అతడు అడిగినట్లు షర్ట్ విప్పి చూపించే ఉంటే.. వారికి మరింత ధైర్యం, ధీమా ఎక్కువై ఉండేదని.. కానీ తను నో చెప్పడంతో అతడు వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. ఆ రూమ్ నుండి డైరెక్టర్ బయటకి వెళ్లిన తరువాత కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తన వద్దకు వచ్చి ఇలా జరిగి ఉండాల్సింది కాదని చెప్పి సారీ  చెప్పిందని జెన్నిఫర్ తెలిపింది.