రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్ గారు ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటడం జరిగింది.  

ఈసందర్భంగా జానీ మాస్టర్ గారు మాట్లాడుతూ ఈ మధ్య నీను ఒక సినిమా లో చూసాను అని ఆ సినిమాలో భవనాలు కట్టడం కోసం చెట్లను నరికి వేస్తున్నారని అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగిందని మనం ఉండడానికి భవనాలు ఎంత అవసరమో బతకడానికి చెట్లు కూడా అంతే అవసరం కాబట్టి వాటిని ప్రతిఒక్కరు రక్షించాలని కోరారు.

యాంకర్ రష్మికి ఛాలెంజ్ విసిరిన శ్రీముఖి!

అదేవిధంగా ఒక సినిమా సెట్టింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తన షూటింగ్ కోసం వేసిన సెట్ అంతా చెట్టునుండి వచ్చే చెక్కతో  చేయబడినది దీని వలన చెట్లు అంతరించి పోతున్నాయి అని అందువలన చెక్కను వాడకుండా ఇకపై నా సెట్టింగ్లు ఇనుము; స్టీల్ తోనే ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారని తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మరొక నలుగుర్ని 1)శేఖర్ మాస్టర్ 2)గణేష్ మాస్టర్ 3)రఘు మాస్టర్ 4)హీరోయిన్ రష్మిక మందనలను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.