రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శ్రీముఖి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుందని చెప్పారు. 

ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసునని కాబట్టి ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

టీజర్ : ఫోర్న్ చూస్తూ, వయాగ్రా మింగిన దెయ్యం!

వాతావరణ కాలుష్యం వల్ల తన స్నేహితులు చాలా మంది వారి పిల్లలను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడే స్థిరపడదామనే ఆలోచనలో ఉన్నారని.. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనమందరం కలిసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇందులో భాగంగా ఇప్పటికే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. 

తన తరపున మరోక ముగ్గురిని బిగ్ బాస్ ఫేం వితిక, కొరియోగ్రాఫర్ జానీమాస్టర్, యాంకర్ రష్మిలను మొక్కలు నాటాలని కోరారు. అదేవిధంగా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు స్వతహాగా  మొక్కలు నాటాలని కోరుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్  పాల్గొన్నారు...