అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం దఢక్ మంచి విజయం సాధించింది. అందంలో శ్రీదేవి అంత స్థాయి కాకున్నా.. జాన్వీ కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఇక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని విజయాలు సాధిస్తే జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ గా ఎదగొచ్చు. 

ఇక జాన్వీ కపూర్ కు శ్రీదేవి లాగే భక్తి భావాలు కూడా ఎక్కువే. శ్రీదేవి ఉన్నప్పుడు తరచుగా బోనికపూర్ కుటుంబం తిరుమలని సందర్శించేవారు. ఇప్పుడు జాన్వీ కపూర్ అదే పద్ధతి ఫాలో అవుతోంది. రీసెంట్ గా జాన్వీ కపూర్ తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది. శ్రీవారి దర్శనం చేసుకుంది. జాన్వీ కపూర్ తిరుమలకు కాలినడకన వెళ్లడం విశేషం. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🌈🌞

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Feb 9, 2020 at 7:53am PST

తిరుమలకు కాలినడకన వెళుతున్న ఫోటోలని జాన్వీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కొంత దూరం మెట్లు ఎక్కాక అలసటతో పక్కనే హాయిగా సేదతీరుతోంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్న జాన్వీ కపూర్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 

నలుగురు హీరోయిన్లు..అక్కడ నేనుంటే బాగుండేది.. ఎంపీ కామెంట్స్ వైరల్!

జాన్వీ కపూర్ తన తిరుమల పర్యటన గురించి పెద్దగా విశేషాలు రివీల్ చేయలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే భవిష్యత్తులో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ లోకి కూడా జాన్వీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.