సెలబ్రెటీలపై మీడియానే కాదు మామూలు జనం ఓ కన్నేసి ఉంచుతారు. ఎప్పుడు అవకాసం దొరుకుతుందా ట్రోల్ చేద్దామనుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట దొరికిపోతూంటారు. ఇప్పుడు జాన్వీ కపూర్ దు అదే పరిస్దితి. ఆమె తన దుప్పట్టాకు ప్రైస్ ట్యాగ్  తీయటం మర్చిపోవటంతో ఆన్ లైన్ లో ఆమెను ఆ విషయం ఎత్తి చూపుతూ ట్రోల్ చేస్తున్నారు. ఇనిస్ట్రగ్రమ్ లో షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయం స్పష్టంగా కనపడుతోంది.

తన ఇంటి నుంచి కారు ఎక్కుతూండగా తీసిన వీడియో ఇది. ఆమె తన అభిమానులు వైపు తిరిగి ఓ చిన్న స్మైల్ ఇస్తూ కారు ఎక్కింది. అప్పుడే ఆమె డ్రస్ కు వెనక వైపు ఉన్న ప్రైస్ ట్యాగ్ హైలెట్ అయ్యింది. దాన్ని సోషల్ మీడియా జనం ఎత్తి చూపుతూ..అంత బిజీనా... ఆ మాత్రం చూసుకోవద్దా అని ట్రోల్ చేస్తున్నారు.

(Also Read)  లగ్జరీ కారు కొన్న జాన్వీకపూర్.. ఫోటోలు వైరల్!

ధడక్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్‌.  అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాహ్నవి కపూర్‌ చిత్రసీమకు పరిచయం కావటంతో ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. వాస్తవానికి సినీ పరిశ్రమకు వారసులు కొత్త కాదు. వారసుల చిత్రాలపై ఉండే ఆసక్తీ కొత్త కాదు. అయితే శ్రీదేవి కుమార్తె సినిమాల్లోకి వస్తోందనగానే ఇంతకుముందెన్నడూ లేని ఆసక్తి నెలకొంది.  ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ అంచనాలను సొగసైన అందంతో, సాటిలేని అభినయంతో  నిలబెట్టుకుంది జాన్వీ.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క తన సినిమాలకు, కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటారు జాన్వీ. ఇలాంటి వార్తలతో అప్పుడప్పుడూ జాహ్నవి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#jhanvikapoor snapped at her pilates class today #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on Oct 22, 2019 at 1:46am PDT