బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ 'ధడక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటిగా తన సత్తా చాటింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో అమ్మడుకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే గుంజన్ సక్సేనా బయోపిక్, అలానే 'తక్త్' చిత్రాల్లో నటిస్తోంది.

తరచూ ఈ బ్యూటీ కురచ దుస్తులు వేసుకుంటూ కెమెరాల కంట పడుతుంటుంది. ఆమె ఎదురైన వెంటనే బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు కెమెరాలు క్లిక్ మనిపిస్తుంటారు. ఆమె ఫోటోలకు రకరకాల కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వెబ్ సైట్లకు జాన్వీ మంచి స్టఫ్ అనే చెప్పాలి. తాజాగా ఆమెకి సంబంధించిన మరికొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె జిమ్ వెళ్తున్నప్పుడు తీసే ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.

ఉస్తాద్ 'ఇస్మార్ట్ శంకర్'.. బుల్లితెరపై కూడా రికార్డులు!

ఆ మధ్య ఒకే రకమైన బట్టలు వేసుకుంటుందని ఆమెని ట్రోల్ చేశారు. దీనికి ధీటుగా బదులిచ్చింది జాన్వీ. రోజుకో రకమైన బట్టలు వేసుకొని జిమ్ వెళ్ళేంత డబ్బు తన దగ్గర లేదని.. కాబట్టి రిపీట్ చేస్తూ వేసుకుంటానని ట్రోలర్ల నోర్లు మూయించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తూ కనిపించింది. స్పోర్ట్స్ వేర్ లో జాన్వీని చూసిన వారు ఫిదా అవుతున్నారు. 

స్పోర్ట్స్ బ్రా, షార్ట్ వేసుకున్న జాన్వీ చాలా క్యూట్ గా ఉంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలో జాన్వీ ఓ కాస్ట్లీ బ్రాండ్ బ్యాగ్ ధరించింది. దాని ధర అక్షరాల నాలుగు లక్షల రూపాయలు.