ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా.. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం జూలైలో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. వరుస పరాజయాల్లో ఉన్న పూరి జగన్నాధ్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్ కెరీర్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ చిత్రం మంచి ఉత్సాహాన్నిచ్చింది. 

పూరి జగన్నాధ్ దర్శకత్వం, రామ్ మ్యానరిజమ్స్.. నభా, నిధి అగర్వాల్ గ్లామర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయాన్ని కారణమయ్యాయి. రామ్ కెరీర్ లోని ఇస్మార్ట్ శంకర్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించగా, ఛార్మి నిర్మాణ భాద్యతలు చూసుకుంది. 

ఇస్మార్ట్ శంకర్ చిత్ర హవా బుల్లి తెరపై కూడా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని దాసరా కానుకగా ప్రముఖ ఛానల్ లో జీ తెలుగులో ప్రసారం చేశారు. కాగా ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ నమోదైంది. మిగిలిన చానల్స్ లో ప్రదర్శినంచిన చిత్రాలని అధికమించి ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి 16.6 రేటింగ్ నమోదు కావడం విశేషం. 

దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై మాస్ ఆడియన్స్, యువత ఎంత ఆసక్తిగా ఉన్నారో అని. మీడియం బండ్జెట్ లో తెరక్కించిన ఈ చిత్రం పూరి జగన్నాధ్ కు అత్యధిక లాభాలు తీసుకువచ్చింది. 

హీరో రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. పూరి జగన్నాధ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారు. హీరోయిన్లు నభా, నిధి అగర్వాల్ కి కూడా మంచి అవకాశాలు దక్కుతున్నాయి.