సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'దర్బార్' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రజినీ మేనరిజమ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తొలిషో నుండే సినిమా హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రజినీకాంత్ సినిమాల్లో డైలాగ్స్ అంటే ఓ రేంజ్ లో పేలుతుంటాయి. ఆ డైలాగ్స్ తో 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది పేరు వినిపించడం ఆశ్చర్యపరుస్తోంది. సినిమాలో ఓ కామెడీ సీన్ లో హైపర్ ఆది గురించి ప్రస్తావించారు.

ఆ యాక్టర్ నన్ను టార్గెట్ చేశాడు.. కావాలనే తొక్కేశాడు.. శివారెడ్డి

హీరోయిన్ నయనతార ఫ్యామిలీకి చెందిన ఓ పెళ్లిలో చిన్నపాప మెడలో గొలుసు పోతుంది. దాన్ని వెతకడానికి హీరోయిన్ ఏకంగా సినీ కమిషనర్ అయిన హీరోని పిలుస్తుంది. పాపతో రజినీకాంత్ మాట్లాడే సమయంలో పక్కనే ఉండే కమెడియన్ హైపర్ ఆది పేరు ప్రస్తావిస్తాడు. ముందుగా ఆ పాపని చైన్ ఎక్కడ పోగొట్టుకున్నావ్ అమ్మా.. అంటూ ప్రేమగా అడుగుతాడు.

దానికి ఆ పాప తెలిస్తే నీకెందుకు ఫోన్ చేస్తా.. నేనే వెతుక్కుంటా కదా అని సమాధానమిస్తుంది. దాంతో రజినీ 'జబర్దస్త్' పంచా..? అంటే.. పక్కనే ఉన్న యోగిబాబు 'హైపర్' ఆది ట్రైనింగ్ అని ఓ డైలాగ్ చెబుతాడు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ నోట 'జబర్దస్త్' ప్రస్తావన రావడం, 'దర్బార్' సినిమాలో హైపర్ ఆది పేరు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.