'జబర్దస్త్' కార్యక్రమం చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే.. ఈ షోకి దర్శకులుగా పని చేసే వారికి 'మల్లెమాల' సంస్థకి మధ్య విభేదాలు తలెత్తడంతో షో డైరెక్టర్లు బయటకి వచ్చేశారు. అప్పటినుండి జబర్దస్త్ షోకి సంబంధించిన గొడవలు మొదలయ్యాయి. జీ తెలుగు ఛానెల్ ని ఆశ్రయించిన ఈ దర్శకులు ఇప్పుడు ఆ ఛానెల్ లో కొత్త షో చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు పనులు కూడా మొదలుపెట్టారు. తమకున్న పరిచయాలతో జబర్దస్త్ టీమ్స్ లోని సభ్యులను బయటకి లాగడం మొదలుపెట్టారు. షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న నాగబాబుని బయటకి లాగితే.. షోపై ఇంపాక్ట్ పడుతుందని.. ఆటోమేటిక్ గా మిగిలిన సభ్యులు కూడా బయటకి వస్తారనే ఆలోచనతో ముందుగా నాగబాబుని బయటకి తీసుకొచ్చారు.

మతిపోగొడుతోన్న ఇల్లీ బేబీ అందాలు.. ఓ లుక్కేయండి!

ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ షోకి పని చేయడం లేదు. ఈ షో మిగిలిన టీమ్స్ అన్నీ ఓ ఎత్తయితే.. హైపర్ ఆది ఒక్కడే మరో ఎత్తు. జబర్దస్త్ షోకి హైపర్ ఆది కీలకంగా మారాడు. కేవలం అతడి స్కిట్ ల కోసం షో చూసేవారు చాలా మంది ఉన్నారు. రేటింగ్స్ కూడా హైపర్ ఆది స్కిట్స్ కే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది.

యూట్యూబ్ లో కూడా మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఇలాంటి కీలకమైన వ్యక్తి ఇప్పుడు ఈ షో నుండి తప్పుకుంటాడా..? లేదా అనే విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతానికైతే హైపర్ ఆది జబర్దస్త్ షోకే పని చేస్తున్నారు. రెమ్యునరేషన్ భారీగా ఆఫర్ చేయడంతో హైపర్ ఆదికి కూడా బయటకి వెళ్లాలని ఉందట.

కానీ ఇప్పుడు అతడు లీగల్ సమస్యల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం.. అతడు కేవలం మల్లెమాలకి మాత్రం పని చేయాలనీ వాదిస్తోంది ఆ సంస్థ. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లిందంటే.. చివరికి హైపర్ ఆది సినిమాల్లో నటించడానికి కూడా వీళ్లేదంటూ మల్లెమాల సంస్థ ఆంక్షలు విదిస్తోందట.

దీంతో షాక్ అయిన హైపర్ ఆది ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. నిజానికి అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తన కెరీర్ ఆ వైపు టర్న్ తీసుకోవాలని భావిస్తున్నాడు.  కానీ ఇప్పుడు ఈ టీవీ షోల కారణంగా సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడుతుండడంతో భవిష్యత్తులో అతడు టీవీకి దూరం కావడం ఖాయమని అంటున్నారు.