ప్రముఖ కమెడియన్ రాకెట్ రాఘవ జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా రాఘవ ఎన్నో చిత్రాల్లో నటించాడు. అడపాదడపా సినిమాలు చేస్తూ.. జబర్దస్త్ లో రాఘవ కంటిన్యూ అవుతున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. 

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించేవారు ప్రభుత్వ సూచనల మేరకు హోమ్ క్వారంటైన్ పాటించాలి. తాజాగా రాకెట్ రాఘవ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. రాఘవా ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. 

అల్లు అర్జున్ సినిమా చూశా.. నేను తప్ప ఇంకొకరు చేయకూడదు.. బాలీవుడ్ హీరో

దీనితో ప్రభుత్వ అధికారులు తెలంగాణ ఏపీ బోర్డర్ సూర్యపేట జిల్లాలో రాఘవకు హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేశారు. ఆ స్టాంప్ వేయించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంట్లోనే కొన్నిరోజుల పాటు ఉండాలి. రాఘవ ఆ స్టాంప్ ని సంతోషంగా వేయించుకున్నారు. ఆ ఫోటోని రాఘవ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.