స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రం రికార్డ్ సృష్టించింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అల వైకుంఠపురములో చిత్ర హిందీ రీమేక్ కు భారీ డిమాండ్ నెలకొంది ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతని కూడా ఆకట్టుకునే సబ్జెక్టు కావడంతో ఈ చిత్ర రీమేక్ లో నటించేందుకు బాలీవుడ్ యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. 

ఇప్పటి వరకు ఈ చిత్ర హిందీ రీమేక్ కోసం అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ లాంటి హీరోల పేర్లు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ బహిరంగంగానే అల వైకుంఠపురములో చిత్రం గురించి ఓపెన్ అయిపోయాడు. 

ఎన్టీఆర్ తో పొగరుగా ప్రవర్తన.. బికినీలో ఎలా రెచ్చిపోతోందో చూశారా!

మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. నెట్ ఫ్లిక్స్ తో తాను అల వైకుంఠపురములో చిత్రం చూసినట్లు కార్తీక్ ఆర్యన్ పేర్కొన్నాడు. ఆ చిత్రం చూశాక హిందీ రీమేక్ లో ఎట్టి పరిస్థితుల్లో తానే నేనే నటించాలని ఫిక్స్ అయిపోయా. అల్లు అర్జున్ పాత్రలో నన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకున్నా అని కార్తీక్ ఆర్యన్ ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు. 

దర్శకుడు రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.