కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీనితో ఉపాధిలేని ప్రజలంతా తల్లడిల్లుతున్నారు. లాక్ డౌన్ నుంచి ప్రభుత్వం రైతుల వ్యవసాయ పనులకు మాత్రం మినహాయింపు కల్పించింది. వీలైనంత మేరకు రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 

తాజాగా ఓ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన పొలంలో వ్యవసాయం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. జీవన్ చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ టీమ్ లలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

మహేష్ బాబుకు అమ్మగా నటిస్తా.. రేణు దేశాయ్

పలు టివి కార్యక్రమాలలో యాంకర్ గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం ఎలాంటి షూటింగ్స్ లేకపోవడంతో జీవన్ తన పొలంలో వడ్లు తూర్పార బడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 

ఎప్పటికైనా తనకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం ఉందని జీవన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.