ఈ చిత్రాలు డిజాస్టర్ కావాల్సింది.. బతికిపోయాయి.. ఎలాగంటే

First Published 18, Nov 2019, 10:00 AM IST

సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే వసూళ్లు రావడం కష్టం. అందుకే తొలి రోజు టాక్ కోసం చిత్ర యూనిట్ తో పాటు, ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుంటారు. కానీ కొన్ని చిత్రాలు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ అదరగొట్టేస్తుంటాయి. 

అల్లుడా మజాకా : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి జైత్ర యాత్ర కొనసాగుతున్న సమయంలో 1995లో అల్లుడా మజాకా చిత్రం విడుదలయింది. ఈ చిత్రం పట్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బూతు సినిమా అనే ముద్ర కూడా పడింది. కానీ మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ చిత్రాన్ని నిలబెట్టింది. ఆ ఏడాది అత్యధిక గ్రాసర్స్ లో అల్లుడా మజాకా చిత్రం కూడా ఒకటిగా నిలిచింది.

ఇద్దరు మిత్రులు : రాఘవేంద్ర రావు దర్శత్వంలో తెరకెక్కిన ఇద్దరు మిత్రులు చిత్రం కూడా మొదట ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. నెగిటివ్ టాక్ నుంచి పుంజుకుని ఈ చిత్రం హిట్టైంది.

అన్నమయ్య: మొదట ఈ చిత్రానికి నాగార్జున అన్నమయ్యగా చేయడం ఏంటి అనే కామెంట్స్ వినిపించాయి. నాగార్జున అద్భుత నటన, రాఘవేంద్ర రావు దర్శత్వంలో ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

నువ్వు వస్తావని: నాగార్జున, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. దీనితో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

డాన్ : రాఘవ లారెన్స్ దర్శత్వంలో 'మాస్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగార్జున నటించిన చిత్రం డాన్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రాన్ని మొదట ప్రేక్షకులు డిజాస్టర్ అని తేల్చేశారు. ఈ చిత్రంలో అతి ఎక్కువైందనే కామెంట్స్ వినిపించాయి. కానీ నాగార్జున పవర్ ఫుల్ పెర్ఫామెన్స్, అనుష్క గ్లామర్ ఈ చిత్రానికి భారీ వసూళ్లు తెచ్చిపెట్టాయి.

మురారి : మహేష్ బాబు నటించిన నాల్గవ చిత్రం మురారి. కృష్ణ వంశీ దర్శకుడు. మహేష్ ని మాస్ చిత్రంలో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు మురారి చిత్రం నిరాశనే మిగిల్చింది. ఫలితంగా ఈ చిత్రానికి యువత నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఫిదా అయ్యారు. మహేష్ పెర్ఫామెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, సోనాలి బింద్రే గ్లామర్ మురారిని బ్లాక్ బస్టర్ చేశాయి.

అత్తారింటికి దారేది : జల్సా తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలయింది. పవన్ అభిమానులు పవర్ ఫుల్ మూవీని ఆశించారు. కానీ త్రివిక్రమ్ సాఫ్ట్ ఫ్యామిలీ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ మొదలయింది. ఆల్రెడీ పైరసీ కూడా లీకైపోవడంతో ఇక ఈ చిత్ర కథ కంచికే అని అనుకున్నారు. కానీ పవర్ స్టార్ క్రేజ్, త్రివిక్రమ్ సెట్ చేసిన ఎంటర్టైన్మెంట్ యావరేజ్ మూవీని కాస్త ఇండస్ట్రీ హిట్ గా మార్చేశాయి.

జనతా గ్యారేజ్ : శ్రీమంతుడు తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం జనతా గ్యారేజ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి టాక్ అంత పాజిటివ్ గా రాలేదు. కానీ క్రమంగా పుంజుకున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

సరైనోడు: బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని మొదట డిజాస్టర్ అనే టాక్ వినిపించింది. క్రిటిక్స్ కూడా అదే రకమైన రివ్యూలు ఇచ్చారు. రొటీన్ మా స్టోరీ అనే కామెంట్స్ వినిపించాయి. కానీ బోయపాటి మాస్ కథతోనే మరోసారి మ్యాజిక్ చేశాడు. సరైనోడు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

నాయక్  : వివి వినాయక్ దర్శత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం ఇది. రొటీన్ సినిమా అనే కామెంట్స్ వినిపించాయి. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.

ఎంసిఏ: నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఎంసిఏ. ఎంసీఏ చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. కానీ వసూళ్లు మాత్రం అదిరిపోయాయి.

loader