ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజల్లో కరోనా భయమే కనిపిస్తోంది. అంతలా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ఎంతకూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇండియాలో ఇప్పటివరకు 137 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. 

ఇలాంటి సున్నితమైన సమయాల్లో సెలెబ్రిటీలుగా ఉన్నవారు బాధ్యతాయుతంగా మెలగాలి.. మాట్లాడాలి.. ఏమాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియాలో నెటిజన్లకు దొరికిపోతారు. ప్రముఖ హిందీ బుల్లితెర హీరోయిన్, సినీ నటి దివ్యంకా త్రిపాఠి తాజాగా ఓ ట్వీట్ చేసి విమర్శలని ఎదుర్కొంటోంది. 

లావణ్య త్రిపాఠి నా భార్య, మా పెళ్లి అలా జరిగింది.. పిచ్చి వాగుడుపై కేసు

'కరోనా ప్రభావం వల్ల ముంబై వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మెట్రో నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి, రోడ్లు, బ్రిడ్జిలు త్వరగా పూర్తి చేసేందుకు ఇదే మంచి సమయం' అని దివ్యంకా ట్వీట్ చేసింది. 

దీనితో నెటిజన్లు దివ్యంకపై విరుచుకుపడ్డారు. అంటే నీ దృష్టిలో ఇంజనీర్లు, నిర్మాణ కార్మికులవి ప్రాణాలు కావా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఈ కామెంట్ పై దివ్యాంక స్పందించింది.. మీరు చెప్పింది కూడా పాయింటే.. క్షమాపణలు అని తెలిపింది.