ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ అధినేతలు నారాయణ్ దాస్, సునీల్ నారంగ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వారి ఇళ్లల్లోనే కాకుండావారి సన్నిహితుల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు చేశారు.

ఇటీవలే సునీల్ నారంగ్.. మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ మాల్ ని నిర్మించారు. త్వరలోనే హీరో అల్లు అర్జున్ తో కలిసి సత్యం థియేటర్ వద్ద మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. నైజాంలో భారీగా చిత్రాలను పబ్లిష్ చేయడంతో పాటు ఏషియన్ సినిమాస్ పేరిట పలు థియేటర్లను నిర్మించింది ఏషియన్ నిర్మాణ సంస్థ.

వైరల్ ఫొటో: బీర్ బాటిల్ తో రచ్చ చేస్తున్న పూజ హెగ్డే!

గతంలో ఏఎంబీ మల విషయంలో కూడా జీఎస్టీ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా సునీల్ నారంగ్ కి అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఆ సమయంలో అధికారులకు ఫైన్ చెల్లించేసి తప్పించుకున్నాడు సునీల్ నారంగ్. ప్రస్తుతం ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థపై నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ సినిమాను రూపొందిస్తున్నారు.