ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ అను మాలిక్ పై ఇటీవల సింగర్ సోనా మొహాపాత్ర మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అను మాలిక్ తనను ఎంతో వేధించాడని.. ఆడవారి పట్ల అతడి ప్రవర్తన సవ్యంగా ఉందని చెప్పింది. ఓ షోలో అను మాలిక్ ని పొగిడిన ప్రముఖ క్రికెటర్ సచిన్ ని కూడా సోనా మొహపాత్ర విడిచిపెట్టలేదు.

సచిన్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. ఆడవాళ్లను ఇబ్బంది పెట్టే ఈ నీచుడిని మెచ్చుకుంటారా..? అంటూ సచిన్ ని ప్రశ్నించింది. కానీ దీనిపై సచిన్ స్పందించలేదు. తాజాగా సోనా మొహా పాత్ర లానే  మరో గాయని నేహా భాసిన్ కూడా అను మాలిక్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచింది.

మత్తెక్కించే రాశి సొగసులు.. ఓ లుక్కేయండి!

అను మాలిక్ తనతో ప్రవర్తించిన తీరుని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. సోనా మొహాపాత్రకి మద్దతు తెలుపుతూ 'నువ్ చెప్పింది నిజమే సోనా.. అను మాలిక్ ఓ కామాంధుడు.. నన్ను నన్ను కూడా వదిలిపెట్టలేదు' అంటూ చెప్పుకొచ్చింది. 21 ఏళ్ల వయసులో తను అను మాలిక్ స్టూడియోకి వెళ్లినట్లు చెప్పిన నేహా.. తనకు ఛాన్స్ ఇస్తాడనుకుంటే.. అసహ్యంగా ప్రవర్తించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది.

భయపడిపోయి అక్కడ నుండి వెళ్లిపోయానని.. ఆ తరువాత తనను చాలా ఫోన్లు, మెసేజ్ లు చేశాడని చెప్పుకొచ్చింది. తాను మాత్రం దేనికీ స్పందించలేదని చెప్పింది. వయసులో పెద్దవాడైనా అను మాలిక్ ఇలా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్.. అని ప్రశ్నించింది. అలాంటి వాడు టీవీలో ఎలా కనిపిస్తున్నాడో అర్ధం కావడం లేదని పేర్కొంది. ఈ నిజాలను బయటపెట్టిన తరువాత తనకు ఏం జరిగినా పరవాలేదని చెప్పుకొచ్చింది నేహా.