ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు.

ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి వుందని, నారాయణ  హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు.

మన బుల్లితెర యాంకర్లు వాడే కాస్ట్లీ కార్లు ఇవే..!

అలానే హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో పలు హిట్ చిత్రాలను రూపొందించారు. హలో బ్రదర్‌, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,  సంతోషం, రాఖీ, దొంగాట, క్షణక్షణం వంటి చిత్రాలను ఇలా ఎన్నో సినిమాలను రూపొందించారు. ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన నిర్మాతగా సినిమాలు తీసిన దాఖలాలు లేవు.