కొన్ని రోజుల క్రితం తమిళ స్టార్ హీరో విజయ్ పై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విజయ్ నుంచి, బిగిల్ ఫైనాన్షియర్ అంబు చెలియన్ నుంచి అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ఆ సమయంలో విజయ్ అభిమానుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. 

తాజాగా గురువారం రోజు మరోసారి ఐటీ అధికారులు విజయ్ నివాసంపై దాడులు జరిగిపారు. కానీ ఈ సారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదయం ప్రారంభమైన ఐటీ దాడులు సాయంత్రానికి ముగిశాయి. దాడులు ముగిసిన అనంతరం అధికారులు ఊహించని వ్యాఖ్యలు చేశారు. 

నేను తీసిన సినిమా తుస్సుమంది.. రాఘవేంద్ర రావుకి సారీ చెప్పిన పూరి!

విజయ్ బిగిల్ చిత్రానికి 50 కోట్ల రెమ్యునరేషన్, మాస్టర్ చిత్రానికి 80 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ రెండు లావాదేవీలకు సంబంధించిన టాక్సులని విజయ్ పక్కాగా చెల్లించారని, ఎలాంటి ఎగవేతకు పాల్పడలేదు అంటూ క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం. 

దీనితో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.