ఓ నటుడు తనను ఒంటరిగా రమ్మాన్నాడని సీనియర్ హీరోయిన్ ఇషా కొప్పికర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగులో ఈమె 'చంద్రలేఖ', 'ప్రేమతో రా' వంటి చిత్రాల్లో నటించారు. ఆ తరువాత తమిళ, కన్నడ ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యారు.

బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో రాణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇషా కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఓ సందర్భంలో కొందరు తనను అనుచితంగా తాకారని, ఆ తరువాత ఆత్మరక్షణకు ఏం చేయాలో.. ఇతరుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని చెప్పారు. ఓ సినిమా కోసం తనను తీసుకోవాలని అనుకున్నారని.. దానికోసం నిర్మాత తనకు ఫోన్ చేసి 'ఫలానా నటుడికి ఫోన్ చెయ్.. అతడితో స్నేహంగా ఉండమని' చెప్పినట్లు ఇషా వెల్లడించింది.

చిన్న పిల్లాడిపై బూతులు.. ఆ హీరోయిన్ నిజంగానే ఆంటీ అంటూ ట్రోలింగ్!

దీంతో ఆ హీరోకి ఫోన్ చేస్తే.. అతడు తన పూర్తి టైం టేబుల్ చెప్పి.. కలిసే తీరిక లేదన్నట్లుగా మాట్లాడారని ఇషా తెలిపింది. చివరకు ఓ రోజు తనను రమ్మన్నాడని చెప్పింది.  ఎవరితో కలిసి వస్తున్నావ్ అని అడిగితే.. నాతో పాటు డ్రైవర్ వస్తారని ఆ హీరోతో చెబితే.. 'ఎవరినీ తోడు తీసుకొని రావొద్దు.. నువ్ ఒక్కదానివే రా' అని చెప్పినట్లు తెలిపింది ఇషా..

అతడి చెడు ఉద్దేశం తనకు అర్ధమైందని.. అందుకే వెంటనే.. నేను ఖాళీగా లేనని ఆ హీరోకి చెప్పినట్లు గుర్తు చేసుకుంది ఇషా.. ఆ సమయంలో ఇషా వయసు 15 లేదా 16 మాత్రమే ఉంటాయని చెప్పింది.

ఆ తరువాత చిత్రనిర్మాతకు ఫోన్ చేసి.. నటిగా తన నైపుణ్యం చూసి సినిమాకు ఎంపిక చేసుకోవాలని.. అంతేకాదు ఇలాంటి నీచమైన పనులు చేయనని గట్టిగా చెప్పినట్లు ఇషా వెల్లడించింది. దీంతో ఆ సినిమా తన చేజారిపోయిందని తెలిపింది. ఓ మహిళ ఇలా వ్యతిరేకించి మాట్లాడితే.. జనాలు తట్టుకోలేరని ఇషా పేర్కొంది.