స్వరా భాస్కర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. స్వరా భాస్కర్ తను వెడ్స్ మను. వీరే దె వెడ్డింగ్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. వీరే దే వెడ్డింగ్ చిత్రంలో స్వరా భాస్కర్ నటించిన ఓ అడల్ట్ సన్నివేశం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ చిత్రం స్వరా భాస్కర్ కు ఎంతగా గుర్తింపు తీసుకువచ్చిందో అదేస్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. 

తనపై వస్తున్న విమర్శలని, ట్రోలింగ్ ని స్వరా భాస్కర్ ధైర్యంగా ఎదుర్కొంది. రీసెంట్ గా స్వరా భాస్కర్ 'సన్నాఫ్ అభిశ్' అనే కామెడీ షోలో పాల్గొంది. ఈ షోలో స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. ఈ షోలో స్వరా భాస్కర్ గతంలో తనని ఆంటీ అని పిలిచిన 4 ఏళ్ల పిల్లాడిని బూతులు తిట్టిన విషయాన్ని కామెడీగా చెప్పింది. 

 నా కెరీర్ ఆరంభంలో కొన్ని యాడ్ షూట్స్ లో పాల్గొనేదాన్ని. ఓ సోప్ యాడ్ లో భాగంగా 4 ఏళ్ల పిల్లాడు నన్ను ఆంటీ అని పిలిచాడు. ఎవరికైనా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం ఉంటుందా.. నాకు కూడా కోపం వచ్చింది. ఆంటీ అంటూ నా దగ్గరకు వచ్చాడు. కోపంతో తిట్టేశాను. వీళ్లంతా చిన్న పిల్లలాలేక దయ్యలా అని స్వరా భాస్కర్ కామెంట్స్ చేసింది. 

స్వరా భాస్కర్ ఈ విషయాన్ని కామెడీగా చెప్పినప్పటికీ.. ఇదేం కామెడీ షో.. చిన్న పిల్లలని దూషించడం కామెడీనా.. ఆంటీ అని పిలిస్తే ఇంతలా దూషిస్తారా అంటూ స్వరా భాస్కర్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమె నిజంగానే ఆంటీ అంటూ 'Swara Anunty' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

స్వరా భాస్కర్ వ్యాఖ్యలని పలు ఎన్జీవో సంస్థలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఆమెపై జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంస్థలో కేసు కూడా నమోదు చేశారు. పలువురు నెటిజన్లు స్వర భాస్కర్ తీరుని తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

స్వరా భాస్కర్ ఆమెని నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఓ జాతీయ ఛానల్ లో చిన్నపిల్లలని తిట్టడం దారుణమైన విషయం అని ఓ మహిళ ట్వీట్ చేసింది. స్వర భాస్కర్ పై కేసు నమోదు చేసి శిక్షించాలి అని మరో నెటిజన్ ట్వీట్ చేసారు.