Asianet News TeluguAsianet News Telugu

నానికి సమస్యగా మారిన వరుణ్ తేజ్!

కంచె, లోఫర్ వంటి సినిమాలతో నిలదొక్కుకోలేకపోయిన వరుణ్ తేజ ..ఫిధా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో కాస్త ఒడ్డున పడ్డాడు. అయితే ఫిదా చిత్రం సక్సెస్ లో సాయి పల్లవి, శేఖర్ కమ్ముల షేర్ వెళ్లిపోవటంతో వరుణ్ తేజ కు సోలోగా మంచి హిట్ కావాలని మెగాభిమానులు కోరుకున్నారు. 

is varun tej become a threat to nani
Author
Hyderabad, First Published Oct 22, 2019, 10:46 AM IST

సినిమా ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం లెక్కలు మారిపోతూంటాయి. హిట్ రాగానే ఒక్కసారిగా హీరోలకు క్రేజ్ క్రియేట్ అయ్యిపోతుంది. అప్పటిదాకా ముందు ఉన్న వాళ్లు వెనక్కి...వెనక ఉన్న వాళ్లు ముందుకు వెళ్ళిపోతూంటారు. ఇప్పుడు అలాంటి పరిస్దితే వరుణ్ తేజకు, నానికు మధ్య ఏర్పడింది. మినిమం గ్యారెంటీ హీరోగా ట్రేడ్ లో నిలదొక్కుకున్న నాని మార్కెట్ మెల్లిగా గల్లంతు అవటం మొదలైంది. అదే సమయంలో వరుణ్ తేజ ..నిలదొక్కుకున్నాడు.

కంచె, లోఫర్ వంటి సినిమాలతో నిలదొక్కుకోలేకపోయిన వరుణ్ తేజ్.. ఫిధా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో కాస్త ఒడ్డున పడ్డాడు. అయితే ఫిదా చిత్రం సక్సెస్ లో సాయి పల్లవి, శేఖర్ కమ్ముల షేర్ వెళ్లిపోవటంతో వరుణ్ తేజ కు సోలోగా మంచి హిట్ కావాలని మెగాభిమానులు కోరుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన మిస్టర్, అంతరిక్షం...వచ్చిన ఆ క్రేజ్ ని కాస్తా వెనక్కి లాగేసాయి. తొలి ప్రేమ సినిమా మళ్లీ వరుణ్ తేజ్ కాస్త కోలుకునేలా చేసింది. ఆ వెంటనే వచ్చిన ఎఫ్ 2 సినిమా టాలీవుడ్ లో వరుణ్ తేజకు ఓ స్దానం కల్పించింది.

తాజాగా వరుణ్ తేజ్ చేసిన వాల్మీకి అలియాస్ గద్దల కొండ గణేష్ కు రివ్యూలు సరిగా రాకున్నా ...కలెక్షన్స్ పరంగా హిట్ అనిపించుకుంది. రిలీజ్ కు ముందు ఈ సినిమా కు పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. హరీష్ శంకర్ వరస ఫ్లాఫ్ ల ఎఫెక్ట్  ఈ సినిమాపై పడింది. కానీ అల్టిమేట్ గా 25 కోట్ల షేర్ సాధించి లాభాల బాట పట్టింది. దాంతో  ఇప్పుడు వరుణ్ తేజ్.. నిర్మాతలకు హాట్ ఫేవరెట్ గా మారిపోయాడు.

''మీరెవరు చెప్పడానికి కౌన్ కిస్కా గొట్టంగాళ్లు..'' కమెడియన్ అలీ ఫైర్!

ఇక వరుణ్ తేజ్ సీన్ లోకి రాకముందు నాని హవా నడిచింది. నిర్మాతల నుంచి ఆ స్దాయి రెమ్యునేషన్ తీసుకునే మినిమం గ్యారెంటీ హీరోగా ఉన్నాడు. అయితే వరసపెట్టి గ్యాంగ్ లీడర్, దేవదాసు, కృష్ణార్జున యుద్దం డిజాస్టర్స్ కావటం నాని కెరీర్ ని పూర్తి నష్టం తెచ్చిపెట్టింది.

జెర్సీ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా అంత స్దాయికి వెళ్లలేదు. నాని నటనకు పేరు వచ్చింది. క్లాస్ ఆడియన్స్ మెచ్చుకున్నారు. కానీ నానికి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా హిట్ అయితే ఆ వేడి కంటిన్యూ అయ్యేది. కానీ గ్యాంగ్ లీడర్ సినిమా పెద్ద దెబ్బే కొట్టింది.
   
దాంతో ఇప్పుడు నిర్మాతలు నాని కన్నా వరుణ్ తేజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. నాని కన్నా వయస్సులోనూ చిన్నగా ఉండటం, యంగ్, డైనిమిక్ ,భాక్సాఫీస్ హిట్ అనేవి కలిసి వస్తున్నాయి.  దాంతో వరుణ్ తేజ..ఎనిమిది నుంచి పది కోట్లు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

నటనపరంగా చూసుకుంటే నానినే బెస్ట్ అనేది ఎవరైనా ఒప్పుకునే అంశం. అయిటే ట్రేడ్ చూసేది నటనకాదు డబ్బులు తెచ్చే హీరో ఎవరనేది కావటంతో నాని కాస్త వెనకబడినట్లే. సరైన సబ్జెక్టు పడితే నాని మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తాడు. అయితే ఈ లోగా యంగ్ హీరోలు తన ప్లేస్ ను ఆక్రమించుకోకుండా చూసుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios