టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా అగ్ర కిరీటాన్ని మోస్తున్న బ్యూటీ పూజా హెగ్డే. నిజం చెప్పాలంటే బేబీ రెండేళ్ళలొనే తన కెరీర్ లో ఊహించని అవకాశాలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథమ్ సినిమా హిట్టయ్యిందో అప్పటి నుంచి గ్యాప్ లేకుండా సినిమాలను ఒకే చేస్తోంది.

అరవింద సమేత ఇంకాస్త బూస్ట్ వచ్చిందనే చెప్పాలి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ అరవింద బేబీ బాలీవుడ్ లో కూడా హౌజ్ ఫుల్ 4 సినిమాతో మంచి బాక్స్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. క్రిటిక్స్ రివ్యూస్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం పూజా హగ్డే కి ఫుల్ హ్యాపీ చేస్తున్నాయి. అక్షయ్ కుమార్ - రితేష్ దేశ్ ముఖ్ లాంటి స్టార్ హీరోస్ నటించడంతో మొదటి నుంచి ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ కి పాజిటివ్ బజ్ నెలకొంది.

దీంతో సినిమా ఫస్ట్ వీకెండ్ లొనే బాక్స్ ఆఫీస్ వద్ద హాఫ్ సెంచరీ కొట్టేసింది. 2019 లో వేగంగా 50కోట్ల వసూళ్లు అందుకున్న సినిమాల లిస్ట్ లో హౌజ్ ఫుల్ 4 నిలిచింది.  అలాగే ఇంతకుముందు వచ్చిన హౌజ్ ఫుల్ సిరీస్ ల కంటే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. బాలీవుడ్ లో మాంచి సక్సెస్ కొట్టాలని చూస్తున్న పూజా హెగ్డే అయితే మొత్తానికి ఓ కమర్షియల్ హిట్ కొట్టేసింది. గతంలో అమ్మడు హృతిక్ రోషన్ తో మెహంజోదరో సినిమా చేసింది. మళ్ళీ చాలాకాలం తరువాత హౌజ్ ఫుల్ 4 తో బాలీవుడ్ తెరపైకి వచ్చిన అమ్మడు కలెక్షన్స్ తో సంతృప్తి చెందింది. మరి ఈ సక్సెస్ అమ్మడికి బి టౌన్ లో ఎలాంటి అవకాశాల్ని అందిస్తుందో చూడాలి.