టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నటి పూజా హెగ్డే. కెరీర్ ఆరంభంలో ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోలేదు. 'డీజే' సినిమాతో ఒక్కసారిగా తన గ్లామర్ యాంగిల్ చూపించి షాకిచ్చింది. ఆ సినిమా ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది.

మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోల సరసన జత కట్టింది. మధ్యలో బాలీవుడ్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ అమ్మడుకి సక్సెస్ రాకపోవడంతో టాలీవుడ్ వైపే దృష్టి పెడుతోంది. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు పూజా హెగ్డే ఓ బాలీవుడ్ కుర్ర హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ ని తెగ పొగిడేస్తోంది.. మ్యాటరేంటో..?

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ మెహరా కొడుకు రోహన్ మెహరాతో పూజా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు సమాచారం. రోహన్ 2018లో 'బాజార్' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రాధిక ఆప్టే లాంటి వారితో కలిసి నటించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానప్పటికీ రోహన్ మాత్రం తన నటనతో ఆడియన్స్ ని మెప్పించాడు. గత కొంతకాలంగా పూజా.. రోహన్ తో ప్రేమలో ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.

అయితే ఈ విషయానికి సంబంధించి అటు పూజా హెగ్డే కానీ ఇటు రోహన్ కానీ స్పందించింది లేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఎఫైర్లు కామనే.. మరి ఈ బంధం పెళ్లి వరకు వెళ్తుందా..? లేదా..? అనేది చూడాలి!