హీరోయిన్లు తమతో కలిసి పని చేసిన హీరోలను, దర్శకులను పొగడడం కామనే.. అయితే కొన్నిసార్లు వారి పొగడ్తలు మితిమీరిపోతుంటాయి. తాజాగా నటి పూజా హెగ్డే.. దర్శకుడు త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ వింటే గనుక ఆశ్చర్యం కలగక మానదు. ఏ హీరోయిన్ అయినా తన దర్శకుడిని గొప్పోడనే చెబుతుంది.

అయితే హీరోయిన్లు ఎక్కువగా హీరోలనే పొగుడుతుంటారు. అది వారి ట్రేడ్ సీక్రెట్ అనే చెప్పాలి. అయితే పూజా హెగ్డే మాత్రం రొటీన్ కి భిన్నంగా దర్శకుడు త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేసింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే.

త్రివిక్ర‌మ్ కొత్త సినిమా టైటిల్ అదేనా..?

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజా హెగ్డే.. త్రివిక్రమ్ కూల్ యాటిట్యూడ్ కి ఫిదా అయిపోయానని చెప్పింది. సెట్ లో అగ్ని ప్రమాదం జరిగిందని ఎవరైనా చెప్పినా కూడా.. త్రివిక్రమ్ చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్ కి అసలు ఈగోనే ఉండదని సర్టిఫికేట్ ఇచ్చేసింది.

తాను ఇంతవరకు పని చేసిన ఏ దర్శకుడూ త్రివిక్రమ్ లా ఓపికగా ఉండలేదని మెచ్చుకుంది. స్వతహాగా రైటర్ అయిన త్రివిక్రమ్ 'సామజవరగమన' పాటలోని లిరిక్స్ మొత్తం ఆమెకి వివరించాడట.

ఇప్పుడు తనను ఎవరు అడిగినా.. పాట అర్ధం మొత్తం విడమరిచి చెప్పగలనని మురిసిపోతూ చెప్పుకొచ్చింది. మరి తనను ఇంతగా అభిమానిస్తోన్న పూజా హెగ్డేకి త్రివిక్రమ్ మరో ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి!