ఓ వైపు కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. టాలీవుడ్ లో పెళ్లిళ్ల జోరు తగ్గడం లేదు. కొన్ని రోజుల క్రితమే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిన్ననే(గురువారం) యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా జరిగింది. 

నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మని వివాహం చేసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే నిఖిల్ వివాహం జరిగింది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే నిఖిల్ వివాహం జరగాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ కరోనా ప్రభావం తగ్గకపోవడం.. ఎంతకూ లాక్ డౌన్ ఎత్తివేయకపోవడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అయినా పెళ్లి తంతు పూర్తి చేయాలని నిఖిల్ నిర్ణయించుకున్నాడు. 

బ్లాక్ బస్టర్ టాలీవుడ్ చిత్రాలని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు

లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా నిఖిల్ పెళ్లి పూర్తయింది. ప్రస్తుతం మరో యంగ్ హీరో నితిన్ పెళ్లిపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి నిఖిల్ తాం వివాహాన్ని పూర్తి చేసుకున్నాడు. నితిన్ పరిస్థితి ఏంటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

నితిన్, అతడి ప్రేయసి షాలిని ల వివాహం ఏప్రిల్ 16న ఫిక్స్ అయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. నితిన్ మాత్రం తన పెళ్లి ఎలాగోలా ముగించేందుకు సిద్ధంగా లేడు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే పండగ. కాబట్టి ఎప్పటికి గుర్తుండిపోయేలా వివాహం జరగాలి. కరోనా ప్రభావం తగ్గాకే తన వివాహం ఉంటుందని నితిన్ ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.