టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి ఈషా రెబ్బకి సరైన బ్రేక్ రాలేదు. 'అరవింద సమేత' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసింది. కానీ ఆ సినిమాతో ఈషాకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. అయినప్పటికీ ఆ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి తరచూ మాట్లాడుతూనే ఉంది.

ఈ సినిమా తరువాత తన వేషధారణ కూడా పూర్తిగా మార్చేసింది. గ్లామరస్ గా కనిపించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఎప్పటికప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోషూట్ లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Bigg Boss 3: ''శ్రీముఖి చెత్త కంటెస్టెంట్, రాహుల్ నక్క..''!

ఎన్టీఆర్ తో నటించడం వలనో మరేమో కానీ తాను మునుపటిలా చిన్న హీరోయిన్ ని కాదని ఫీలవుతున్నట్లు ఉంది ఈషా. అందుకే తాను నటిస్తోన్న చిన్న చిత్రాల నిర్మాతలకు ఆమె సహకరించడం లేదని టాక్. 'రాబోయే ఇరవై నాలుగు గంటల్లో' అనే థ్రిల్లర్ సినిమాలో సత్యదేవ్ తో కలిసి ఈషా నటించింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేసిన ఈషా ఆ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కి మోహన్ చాటేస్తోందట.

చిన్న సినిమా కాబట్టి తనకు ఉన్న పదమూడు లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ సినిమాకి హెల్ప్ అవుతుందని భావించిన నిర్మాతలు ఆమెతో ఓ ప్రమోషనల్ వీడియో చేయించాలని అనుకున్నారు. కానీ ఈషా మాత్రం ఈ సినిమాను పట్టించుకోవడం లేదట. వారు ఎంతగా బతిమాలినా ఈషా మాత్రం లైట్ తీసుకుంటుందట. 

దీంతో ఈషా రెబ్బపై మీడియాలో నెగెటివ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నిర్మాతలకు సహకరించని హీరోయిన్ అంటూ కథనాలు వస్తున్నాయి. ఇంకా కెరీర్ లో సరైన హిట్టు కూడా చూడని ఈ బ్యూటీపై ఇలాంటి వార్తలు రావడం తన కెరీర్ కి మంచిది కాదేమో!