బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో పూర్తి కానుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఒకరు విజేత కానున్నారు. ఇక హౌస్ లో దీపావళి సంబరాల కోసం యాంకర్ సుమని పంపించారు.

సోమవారం నాడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుమ మంగళవారం నాడు కూడా కంటిన్యూ చేసింది. ఓ టాస్క్ లో విజేతగా నిలిచి వరుణ్ కి ఫ్యాన్ తో ఫోన్ కాల్ మాట్లాడే  ఛాన్స్  వచ్చింది. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరికీ వాళ్ల ఫ్యాన్స్ పంపిన ట్వీట్స్ చదివి వినిపించారు.

సెక్సీ లుక్స్ తో కేకపెట్టిస్తున్న అనసూయ.. 'మీకు మాత్రమే చెప్తా' పార్టీ ఫొటోస్!

ఈ క్రమంలో శ్రీముఖి జెండర్ కార్డ్ వాడుతుందని, చెత్త కంటెస్టెంట్ అని, కన్నింగ్ అని ట్వీట్స్ రాగా.. శ్రీముఖి వాటికి క్లారిటీ ఇచ్చింది. అలానే కొన్ని పాజిటివ్ ట్వీట్స్ రాగా ఆ ట్వీట్స్ చేసిన వారికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. బాబా భాస్కర్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ ట్వీట్స్ తో పాటు నెగెటివ్ ట్వీట్స్ కూడా చదివి వినిపించారు.

 

ఇక వరుణ్ ని ఈ సీజన్ లోనే వరస్ట్ కంటెస్టెంట్ అని ఆడియన్స్ నుండి వచ్చిన ట్వీట్స్ చదివి వినిపించగా.. వారికి థాంక్స్ చెప్పాడు. రాహుల్ గురించి ముందుగా పాజిటివ్ ట్వీట్స్ చదివారు. ఎవరు ఏమన్నా.. నవ్వుతో సమాధానం ఇస్తాడని, చాలా మంది  హృదయాలు గెలుచుకున్నావని కొందరు ట్వీట్స్ వేయగా.. రాహుల్ ని నక్కతో పొలుతూ మరికొందరు ట్వీట్స్ వేశారు.

పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా.. పాజిటివ్ గానే తీసుకుంటానని రాహుల్ అన్నారు. అనంతరం హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఆ తరువాత హౌస్ మేట్స్ జాతకం ఏంటో తెలుసుకోవడానికి హౌస్ లోకి జ్యోతిష్యురాలిని పంపించారు బిగ్ బాస్. ఆమె హౌస్ మేట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది.