టాలీవుడ్ లో పేరున్న అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ  ఇచ్చిన సుశాంత్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవటంలో విఫలమయ్యాడనే చెప్పాలి.  సుశాంత్ వరస పెట్టి సినిమాలు స్టార్ డమ్  మాత్రం సంపాదించుకోలేక పోయారు. వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న సుశాంత్ చి ల సౌ మూవీ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. వైవిధ్యమైన కథతో వచ్చిన చిలసౌ మూవీ బాగుందనిపించుకున్నా సుశాంత్ కెరీర్ కు ప్లస్ కాలేకపోయింది.

ఈ నేపధ్యంలో అల వైకుంఠపురములో చిత్రం చేసాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఎంతవరకూ సుశాంత్ కెరీర్ కు ఉపయోగపడబోతోందనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారిన అంశం.

అల్లు అర్జున్ నిజమైన 'మెగా పవర్ స్టార్'.. కుంపటి పెట్టే ప్రయత్నమా?

సాధారణంగా ఓ పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చినప్పుడు ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు, టీమ్ కు, నటీనటులకు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అయితే సుశాంత్ ఈ సినిమాలో మొత్తం కనపడినా క్లైమాక్స్ లో తప్పించి డైలాగులు లేవు. బన్నీ నే సినిమా మొత్తం చెలరేగిపోయాడు. సక్సెస్ మొత్తం తన ఖాతాలో వేసేసుకునే స్దాయిలో అదరకొట్టాడు. మరి సుశాంత్ పరిస్దితి ఏమిటి..అంటే ఈ సినిమా ఎఫెక్ట్ తో ఖచ్చితంగా భవిష్యత్ లో తనకు మంచి సినిమాలు పడతాయని భావిస్తున్నాడట.

అయితే మళ్లీ ఇలాంటి పాత్ర మాత్రం చెయ్యాలని లేదని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ అభిమానులు సైతం సుశాంత్ చిత్రాలకు సపోర్ట్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఇక సుశాంత్ ఈ విషయమై మాట్లాడుతూ.. దర్శకుడు త్రివిక్రమ్ తో పనిచేయడం చాలా అద్భుతంగా ఉందని త్రివిక్రమ్ గారి నుంచి ఎన్నో నేర్చుకున్నాను అని తెలిపాడు. అల వైకుంఠపురం సినిమాలో తన పాత్ర బాగుందని అనుభవం గల నటీ నటులతో కలిసి పనిచేయడం తనకెంతో నచ్చిందని సుశాంత్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సుశాంత్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.