బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుండి బయటపడడానికి కొన్నాళ్లపాటు లండన్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఇక ఇప్పుడే ఇర్ఫాన్ క్యాన్సర్ నుండి కోలుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి గురించి, తన కుటుంబ గురించి చెప్పుకొచ్చారు. కష్ట సమయంలో ఉన్నప్పుడు తన భార్య సుతప, ఇద్దరు కొడుకులు తనకు ఎంతగానో అండగా నిలిచారని చెప్పారు. తను తిరిగి మామూలు మనిషి కావడంలో కుటుంబం పాత్ర ఎంతో ఉందని అన్నారు.

భార్యని వదిలేస్తా అని చెప్పి హీరోయిన్ తో క్రికెటర్ సంబంధం.. బయటపడ్డ నిజాలు!

జీవితమనేది రోలర్‌ క్యాస్టర్‌ రైడ్‌ లాంటిదని .. మధురమైన అనుభూతులతో పాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయని చెప్పారు. సంతోషకరమైన క్షణాలను మాత్రమే గుర్తుంచుకోవాలని చెప్పారు. అలానే తను విపరీతమైన ఆందోళనకు గురయ్యానని.. కానీ దానిని ప్రస్తుతం నియంత్రించగలిగానని చెప్పారు.

తన కొడుకులతో గొప్ప సమయం గడిపానని అన్నారు. తన భార్య గురించి చెబుతూ.. ''నేను జీవించాలని అనుకుంటే నా భార్య కోసం జీవించాలనుకుంటున్నాను.. నేను ఇంకా బతికి ఉండడానికి ఆమే కారణం'' అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'ఆంగ్రేజీ మీడియం' సినిమా మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.