కింగ్ నాగార్జునకు ఇటీవల సరైన సక్సెస్ లేదు. నాగ్ గత ఏడాది నటించిన దేవదాస్, ఆఫీసర్ చిత్రాలతో పాటు ఈ ఏడాది విడుదలైన మన్మథుడు 2  కూడా నిరాశపరిచింది. దీనితో ఓ మంచి హిట్ చిత్రం తెరకెక్కించి తన అభిమానులని సంతృప్తి పరచాలని నాగ్ భావిస్తున్నాడు. మన్మథుడు 2 తర్వాత నాగ్ చిత్రం గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. 

ఊహాగానాలకు తెరదించుతూ తన తదుపరి చిత్రం ప్రకటించడమే కాదు.. ఏకంగా ఫస్ట్ లుక్, టైటిల్ విడుదుల చేసి నాగ్ అభిమానులని సర్ ప్రైజ్ చేశాడు. నాగ్ నెక్స్ట్ మూవీకి 'వైల్డ్ డాగ్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. అహిషోర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకుడు. 

ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నాగార్జున పాత్ర పేరు విజయ్ వర్మ. ఎంతటి కరుడుగట్టిన తీవ్రవాదులనైనా వేటాడి అంతం చేస్తాడు. అందుకే ఇతడిని విజయ్ వర్మ ఉరఫ్ వైల్డ్ డాగ్ అని పిలుస్తారు. ఆసక్తికరంగా రూపొందించిన ఫస్ట్ లుక్ లో చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలని దర్శకుడు రివీల్ చేశాడు. 

పిచ్చెక్కించేలా 'రంగస్థలం' బ్యూటీ ఫోజులు.. ఓ లుక్కేయండి!

హైదరాబాద్ నడిబొడ్డున ఎన్కౌంటర్.. ఆరుగురు మృతి అని దినపత్రికలో వచ్చిన వార్తలో నాగార్జున కనిపిస్తున్నాడు. సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ పోలీస్ ఆఫీసర్ మరణించడంతో విజయ్ వర్మ రంగంలోకి దిగాడని అందులో ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాడు. 

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో నాగార్జున గగనం చిత్రంలో ఆర్మీ అధికారిగా నటించారు. వైల్డ్ డాగ్ చిత్రం అదే జోనర్ లో వస్తోంది. కాకపోతే దర్శకుడు సోలమన్ వైవిధ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.