సినిమాల్లో హీరోయిన్లను కామెంట్ చేస్తే హీరోలు వెళ్లి కొట్టడం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఒకరకమైన హీరోయిజంగా చూపిస్తుంటారు. మరి రియల్ లైఫ్ లో అలా జరుగుతుందా..? అంటే కాస్త అరుదనే చెప్పాలి. కానీ ఓ డైరెక్టర్ మాత్రం తన ప్రేయసిని కామెంట్ చేసిన వ్యక్తిని వెంటపడి మరీ చితకబాదాడట.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..? కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన సుందర్ సి. అలనాటి అందాల తార నటి ఖుష్బూని దర్శకుడు సుందరి సి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది.

2020 సినిమా బొనాంజా... క్రేజీ స్టోరీలతో రెడీగా ఉన్న హీరోలు!

ఇది ఇలా ఉండగా.. ఓ సినిమా షూటింగ్ కోసం ఖుష్బూ, సుందర్ కలిసి పొల్లాచి వెళ్లారట. అప్పుడు ఖుష్బూ ఏనుగుపై కూర్చూని ఉండే సన్నివేశంలో నటిస్తుందట. అక్కడే సుందర్ కూడా ఉన్నాడట. కెమెరా వెనుక ఉన్న ఓ వ్యక్తి ఖుష్బూ అందాన్ని, శరీరాన్ని ఉద్దేశిస్తూ అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నాడట.

ఆ మాటలు సుందర్ చెవిన పడడంతో ముందుగా ఆయన మహిళల గురించి అలా మాట్లాడడం తప్పంటూ హెచ్చరించాడట. కానీ ఆ వ్యక్తి అదే పనిగా ఖుష్బూ గురించి చెత్త కామెంట్స్ చేస్తుండడంతో.. సుందర్ ఆగ్రహానికి లోనయ్యాడట.

తాగి తన ప్రేయసి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆ వ్యక్తిని కొట్టాడట. అక్కడితే ఆగకుండా ఆ వ్యక్తి పారిపోతుంటే సుందర్ వెనకే వెళ్లి మరీ కొట్టాడట. అలా కామెంట్ చేసిన వ్యక్తి పోలీస్ అనే విషయం తెలుసుకున్న సుందర్ షాక్ అయ్యాడట.