రిలీజ్ కు ముందే పవన్ సినిమాకు 60 కోట్లు.. నిజామా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరక్కుతున్న పింక్ రీమేక్ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Interesting news on Pawan kalyan and Krish jagarlamudi movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరక్కుతున్న పింక్ రీమేక్ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పింక్ రీమేక్ తో పాటు ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. 

పవన్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటించబోతున్నాడు. దర్శకుడు క్రిష్ విరూపాక్ష అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. 

ఇంకా ఈ చిత్రం తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోకముందే అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో 60 కోట్ల ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే నిర్మాత పెట్టుబడి 60 శాతం తిరిగి వచ్చేసినట్లే. 

టీవీ నటి దారుణ హత్య.. భర్తే క్రూరంగా, స్నేహితుడితో కలసి అడివిలో..

త్వరలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెలువడనుంది. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్లని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, వాణి కపూర్ లాంటి బాలీవుడ్ భామలతో పాటు నిధి అగర్వాల్, ప్రగ్యాజైశ్వాల్ లాంటి టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఎవరిని ప్రకటించలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios