టీవీ నటి దారుణ హత్య.. భర్తే క్రూరంగా, స్నేహితుడితో కలసి అడివిలో..

నేటి సమాజంలో మానవ సంబంధాలు, మానవత్వ విలువలు దెబ్బతింటున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నిత్యం వార్తల్లో హత్యలకు సంబంధించిన కథనాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అనితా సింగ్(29) అనే బుల్లి తెర నటిని ఆమె భర్తే దారుణంగా హతమార్చాడు. 

TV Actress Murdered in uttarakhand

నేటి సమాజంలో మానవ సంబంధాలు, మానవత్వ విలువలు దెబ్బతింటున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నిత్యం వార్తల్లో హత్యలకు సంబంధించిన కథనాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అనితా సింగ్(29) అనే బుల్లి తెర నటిని ఆమె భర్తే దారుణంగా హతమార్చాడు. 

వివరాల్లోకి వెళితే.. టివి నటి అనితా సింగ్, ఆమె భర్త రవీందర్ సింగ్ పంజాబ్ లో నివాసం ఉంటున్నారు. అనిత టీవీ సీరియళ్ళలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కొన్ని రోజుల క్రితం నుంచి అనితపై ఆమె భర్త రవీందర్ కు అనుమానం పెరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందువల్లే తనని దూరం పెడుతోందని రవీందర్ భావించాడు. 

క్రమంగా రవీందర్ కు ద్వేషం పెరిగి అనితని హత మార్చాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు కులదీప్ తో కలసి పక్కా స్కెచ్ వేశాడు. తన  స్నేహితుడు కులదీప్ కు బాలీవుడ్ లో పరిచయాలు ఉన్నాయని, అతడిని కలిస్తే బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తాడని భార్యని నమ్మించాడు. 

దీనితో ప్లాన్ లో భాగంగా అనితని ఉత్తరాఖండ్ లోని కలదుంగి అనే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ కులదీప్ ని వీరిద్దరూ కలిశారు. అనంతరం ముగ్గురూ ఓ హోటల్ లో భోజనం చేశారు. అనితకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడి నుంచి అనితని వీరిద్దరూ ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. 

అయ్య బాబోయ్.. రష్మిక కుక్క బిస్కెట్ల మ్యాటర్ లీక్ చేసిన నితిన్

అక్కడ అత్యంత దారుణంగా అనితని గొంతు నులిమి చంపేసారు. అనంతరం ఆధారాలు బయటపడకుండా పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేశారు. అనిత తల్లి దండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు సిసి టివి ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుని ఛేదించారు. రవీందర్, కులదీప్ లని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని నైనిటాల్ ఎస్పీ ఎస్కె మీనా మీడియాకు తెలిపారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios