సినీ అభిమానులతో పాటు, టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ కరోనా వచ్చి నెత్తిన పడకుండా ఉంది ఉంటే ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మోతెక్కేవి. కరోనా ప్రభావంతో ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం సైలెంట్ గా ఉంది.  కోవిడ్ 19 వైరస్ ప్రభావంతో వకీలు సాబ్ చిత్రం అనుకున్న సమయానికి విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. 

ఇక ఈ చిత్రం ఎన్ని రోజులు వాయిదా పడితే దిల్ రాజుకు అంత నష్టం అనే టాక్ వినిపిస్తోంది. దీనికి దిల్ రాజు సన్నిహితులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. దిల్ రాజుకు వకీల్ సాబ్ రిలీజ్ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదని అంటున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి 80 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో సహజంగానే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయి. దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి బ్యాంక్ లోన్స్ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు. ఇక కరోనా ప్రభావం వల్ల దిల్ రాజుకు సబ్సిడీ కూడా దక్కే అవకాశం ఉందని అంటున్నారు. 

అనుపమ దూరమవుతోందా.. కారణం ఏంటి?

ఏ రకంగా చూసుకున్న వకీల్ సాబ్ చిత్ర బడ్జెట్ కు సంబంధించి దిల్ రాజు ఆందోళన చెందడం లేదని అంటున్నారు. కాకపోతే వకీల్ సాబ్ చిత్రం వాయిదా పడుతుందనే వార్తల నేపథ్యంలో అభిమానుల్లో మాత్రం నిరాశ ఉంది.