టాలీవుడ్ లో అగ్ర సంగీత దర్శకుడిగా వెలుగొందిన దేవిశ్రీప్రసాద్ కి ఈ మధ్య కాలంలో ఒక్క మ్యూజికల్ హిట్ కూడా రావడం లేదు. ఎన్నడూలేని విధంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తోన్న సినిమాల ఆడియోల గురించి ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

ఒక మూసలో కొట్టుకుపోతున్నాడని, కొత్తగా ట్యూన్లు చేయలేకపోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'ఎంసీఏ', 'హలో గురు ప్రేమ కోసమే', 'మహర్షి' లాంటి సినిమాల ఆడియోలు దేవిశ్రీప్రసాద్ స్థాయికి తగ్గవి కాదనే విషయంలో సందేహం లేదు. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' మ్యూజిక్ మరింతగా విమర్శల పాలవుతోంది. ప్రోమోలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంతకముందు రిలీజ్ చేసిన రెండు ట్యూన్స్ కానీ కొత్తగా ఏమీ అనిపించలేదు.

ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు.. నా ఒంటి మీద బట్టలు.. నటి కామెంట్స్!

సోషల్ మీడియాలో దేవి మీద ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇంతకముందు దేవి లేకుండా సినిమాలు చేయని దర్శకులు ఇప్పుడు అతడి నుండి దూరమవుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో దర్శకుడు కొరటాల శివ కూడా చేరాడు. తన కొత్త సినిమాకి దేవిశ్రీప్రసాద్ ని కాదనుకొని ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మని ఎన్నుకున్నారు.

ఆయనకంటే ముందే త్రివిక్రమ్.. దేవికి దూరమయ్యాడు. దేవిశ్రీప్రసాద్ ని నమ్మి అతడితో కంటిన్యూ అవుతున్నది ఒక్క సుకుమార్ మాత్రమే.. వీరిద్దరికి ఉన్న రిలేషన్ అలాంటిది మరి. సుకుమార్ కి దేవిశ్రీప్రసాద్ మీద చాలా నమ్మకం ఉంది. అలా అని మ్యూజిక్ విషయంలో అసలు రాజీ పడరు. దేవి అందించే ట్యూన్స్ ని అంత ఈజీగా ఓకే చేయరట

సుకుమార్. ఒక పాట కోసం కనీసం యాభై ట్యూన్లు వరకు చేస్తారట. తాను కోరుకున్నట్లు సాంగ్ వచ్చే వరకు సుకుమార్ ఓకే చెప్పరట. అల్లు అర్జున్ తో చేయబోయే కొత్త సినిమా విషయంలో సుకుమార్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారని సమాచారం. కొన్ని నెలల పాటు సంగీత చర్చలు జరిగిన తరువాత రెండు పాటలు ఓకే అయ్యాయని.. అవి బాగా వచ్చాయని టాక్. ఈ పాటలతో దేవి తన విమర్శకులకు సమాధానం చెప్పడం ఖాయమని అంటున్నారు.