ప్రస్తుతం శ్రీముఖి టాలీవుడ్ లో క్రేజీ యాంకర్. గత ఏడాది బిగ్ బాస్ 3 లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం బుల్లి తెరపై పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తోంది. గతంలో శ్రీముఖి నటిగా కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత నటన జోలికి వెళ్ళలేదు. 

ఇదిలా ఉండగా తాజాగా శ్రీముఖి మరోసారి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి 'ఇట్స్ టైం టు పార్టీ' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. డెబ్యూ దర్శకుడు ఇవిఎస్  గౌతమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

'రంగస్థలం' మహేష్ వివాహం.. పెళ్లి ఫోటోలు చూడండి..

ఇటీవల ఈ చిత్ర విశేషాలని ఆయన వివరించారు. నలుగురు యువతీ యువకులు డేటింగ్ యాప్ ని ఉపయోగించడం. దాని వల్ల వారు సమస్యల్లో చిక్కుకోవడం లాంటి అంశాలతో ఈ చిత్రం ఉండబోతోందని అన్నారు. థ్రిల్, సస్పెన్స్ అంశాలని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. 

ఇక ఈ చిత్రంలో శ్రీముఖి అద్భుతమైన పాత్రలో నటిస్తోందని అన్నారు. ఆమె పాత్రలో అనేక వేరియేషన్స్ ఉంటాయి. ఇటీవల విడుదలైన శ్రీముఖి ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చిందని దర్శకుడు తెలిపారు.