జబర్దస్త్ షోతో నటుడు మహేష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. పల్లెటూరి యువకుడి పాత్రలకు బాగా సూట్ అయ్యే బాడీ లాంగ్వేజ్ మహేష్ ది. ఇటీవల మహేష్ టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. 

పావని అనే యువతితో మహేష్ వివాహం జరిగింది. మే 14 తెల్లవారు జామున వీరిద్దరి వివాహం జరిగింది. కొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం ముగిసింది. నటుడిగా మంచి అవకాశాలు అందుకుంటున్న తరుణంలో మహేష్ పెళ్లి చేసుకుని తన రియల్ లైఫ్ జర్నీని కూడా ప్రారంభించాడు. 

రంగస్థలం చిత్రంలో మహేష్ రామ్ చరణ్ స్నేహితుడిగా చేసిన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రంలో మహేష్ కు మంచి పాత్ర పడింది. రంగస్థలం చిత్రం మహేష్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. 

అలాగే మహానటి, ప్రతిరోజూ పండగే లాంటి చిత్రాల్లో కూడా మహేష్ నటించాడు.