ఒకప్పుడు రవితేజ పేరు చెబితే నిర్మాతల పాలిట బంగారు కొండ అనేవారు. ఓ దశలో రవితేజ టాలీవుడ్ టాప్ హీరోలకు సైతం సాధ్యం కాయాన్ని విధంగా వరుస హిట్లు కొట్టాడు.. మాస్ మహారాజగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పదిలం చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం రవితేజ వరుస పరాజయాల నుంచి బయటపడలేకున్నాడు. 

నేల టికెట్టు, టచ్ చేసి చూడు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని ఇలా వరుస ఫ్లాపులు మాస్ మహారాజ్ ని వెంటాడుతున్నాయి. రవితేజ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శత్వంలో క్రాక్ అనే చిత్రంలో నటిస్తున్నాయి. ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కావాల్సింది.. కానీ కరోనా వల్ల ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

క్రాక్ తర్వాత రవితేజ.. వినోదాత్మక చిత్రాల దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన దర్శత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు 80వ దశకం నేపథ్యంలో రస్టిక్ రివేంజ్ డ్రామాగా తెరక్కించనున్నారట. ఇది కాస్త సర్ ప్రైజ్ చేసే అంశమే. 

నటి ప్రైవేట్ ఫోటోలు లీక్, బాయ్ ఫ్రెండ్ తో అలా.. రూ.3 లక్షలకు బేరం!

ఎందుకంటే త్రినాధ్ రావు గత చిత్రాలని పరిశీలిస్తే.. సినిమా చూపిస్తామామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే లాంటి వెటకారంలో కుడుమున్న వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించారు. ఇలాంటి దర్శకుడు రివేంజ్ డ్రామా తెరకెక్కించడం, అది కూడా 80 దశకం బ్యాక్ డ్రాప్ లో అంటే సాహసమే. కథ పవర్ ఫుల్ గా అయినా ఉండుండాలి లేదా దర్శకుడిని రవితేజ గుడ్డిగా అయినా నమ్మేసి ఉండాలి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.