చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎప్పుడూ ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టే వర్తమాన నటీమణులు పెను సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో ఒకటి కాస్టింగ్ కౌచ్. అవకాశాల పేరుతో మోసం చేయడానికి చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారి వలలో చిక్కుకుంటే అంతే సంగతులు. 

తాజాగా ముంబైలోని ఓ వర్తమాన నటీమణికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు తెలియకుండానే.. ఆమె ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయిపోయాయి. దీనితో సదరు నటి ముంబైలో పోలీస్ కేసు నమోదు చేసింది. పోలీసుల విచారణలో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఆ రూమరే నిజమైంది.. ప్రియుడితో అమలాపాల్ సెకండ్ మ్యారేజ్(ఫోటోస్)

పోలీసులు అందించిన సమాచారం మేరకు.. నకుల్ అనే కాస్టింగ్ డైరెక్టర్ కొన్ని రోజుల క్రితం సదరు నటి బాయ్ ఫ్రెండ్ కు రూ.3 లక్షలు ఇచ్చాడట. ఆ మూడు లక్షలతో అప్ కమింగ్ సీరియల్ కోసం నటీ నటుల్ని ఎంపిక చేయాలని కోరాడు. కానీ సమయం గడిచిపోతున్నా నటి బాయ్ ఫ్రెండ్ స్పందించలేదు. దీనితో నకుల తన 3 లక్షలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు.

దీనికి నటి బాయ్ ఫ్రెండ్ అంగీకరించలేదు. దీనితో నకుల్ అతడి వద్ద ఉన్న కాస్ట్లీ ఫోన్ ని దొంగిలించాడు. ఆ ఫోన్ ఫోటో గ్యాలరీలో నటి, ఆమె ప్రియుడు సన్నిహితంగా గడిపిన ప్రైవేట్ పిక్స్ ఉన్నాయి. వాటిని నకుల్ లీక్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.