పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. పవన్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. అలాగే క్రిష్ దర్శత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. 

పవన్ కళ్యాణ్ తొలిసారి పీరియాడిక్ చిత్రంలో నటిస్తుండడంతో PSPK27(వర్కింగ్ టైటిల్)పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీనితో ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు చూపుతున్నారు. 

కొన్ని రోజులుగా ఈ ఈ చిత్రంలో కోహినూర్ డైమండ్ కి సంబంధించిన సన్నివేశం ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సన్నివేశం గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. కోహినూర్ డిమండ్ ని పవన్ కళ్యాణ్ దొంగిలించే ఫైట్ సీన్ అద్భుతంగా ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. సముద్రంలో కోహినూర్ డైమండ్ ని తరలిస్తుండగా పవన్ కళ్యాణ్ చేసే ఫైట్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందట. 

ప్రగతి, పవిత్రని ఏకిపారేసిన నటి సుధ.. మహేష్ సినిమానే రిజెక్ట్ చేశా

ఫైట్ మాస్టర్స్ ఆ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు కాలం నేపథ్యంలో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బందిపోటుగా పవన్ దొంగతనాలు చేసి ఆ సొమ్ముని పేదలకు పంచే పాత్రలో నటిస్తున్నాడు. 

ఇటీవల వకీల్ సాబ్ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజైన సందర్భంగా.. అంతకు మించి  PSPK27 లుక్ ఉండబోతోంది.. సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే వరకు వేచి చూడండి అని క్రిష్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.