మాస్ లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం ఒక్కడు. 2003లో విడుదలైన ఒక్కడు కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటికి ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. గుణశేఖర్ ఆ చిత్రానికి దర్శకుడు. ఎంఎస్ రాజు ఆ చిత్ర నిర్మాత. 

ఆ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు. పాస్ పోర్ట్ కోసం మహేష్ బాబు అతడిని టార్చర్ పెట్టే సన్నివేశం అద్భుతంగా పండింది. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు. 

నాకు, పవన్ కి మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.. అలీ కామెంట్స్

మొట్టమొదటిసారి ఈ ఫోన్ కు నువ్వే ఫోన్ చేయాలని కోరుతాడు. ఆ నంబర్ ని మహేష్ గ్యాంగ్ వినడం.. పాస్ పోర్ట్ కోసం టోనీ అనే పేరుతో అతడిని విసిగించడం చాలా సరదాగా ఉంటుంది. ఆ ఫోన్ నంబర్ 9848032919. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నంబర్ గా ఎవరి నంబర్ ఉపయోగిద్దాం అని అనుకుంటుండగా.. ఎవరిదో ఎందుకు.. నిర్మాత నంబరే వాడేద్దాం అని ఎవరో సలహా ఇచ్చారట. 

దీనితో అదే నంబర్ ని ఉపయోగించారు. సినిమా విడుదలయ్యాక ఆ నంబర్ కు కొన్ని లక్షల కాల్స్ వెళ్లాయట. దీనితో నిర్మాత ఎంఎస్ రాజు నిజంగానే ఫోన్ నంబర్ మార్చేసుకున్నారు.