రాజా రాణి, మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ సౌత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించాడు. గత ఏడాది విడుదలైన బిగిల్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. 

అట్లీ పనితనం మెచ్చిన షారుఖ్ అతడికి అవకాశం ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో చిత్రం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక అట్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఓ చిత్రం చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో రెండోసారి సినిమా చేయనున్నాడు. 

రూ.75 కోట్లు ఆఫర్ చేసిన దిల్ రాజు.. ఎవరికో తెలుసా?

ఈ నేపథ్యంలో అట్లీ ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ షారుఖ్ చిత్రంపైనే పెట్టాడట. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మరో ఆసక్తికర వార్త వచ్చింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే షారుఖ్ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. అట్లీ దర్శత్వంలో నటించాలని ఉన్నప్పటికీ.. ఇటీవలే షారుఖ్ ని రాజ్ కుమార్ హిరానీ కలసి వెళ్లారట. షారుఖ్ కు రాజ్ కుమార్ హిరానీ కథ వినిపించినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరానికి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పీకే, 3 ఇడియట్స్ లాంటి చిత్రాలతో రాజ్ కుమార్ చరిత్ర సృష్టించారు. 

దీనితో షారుఖ్ ముందుగా అట్లీ దర్శత్వంలో నటిస్తాడా లేక రాజ్ కుమార్ హిరానీ వైపు మొగ్గు చూపుతాడా అనేది వేచి చూడాలి. ఇటీవల షారుఖ్ కు బ్యాడ్ టైం సాగుతోంది. షారుఖ్ చివరగా నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.