బాహుబలి చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన హీరో కాదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ప్రభాస్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. సాహో చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. 

ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా అతడితో తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపడం లేదు. భారీ బడ్జెట్ కే మొగ్గు చూపుతున్నారు. సాహో చిత్రానికి యువీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్ వెచ్చించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం కూడా భారీ బడ్జెట్ లోనే తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ప్రభాస్ తదుపరి చిత్రం నాగ్ అశ్విన్ దర్శత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతి సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించనున్నట్లు టాక్. 

ఇదిలా ఉండగా ఈ చిత్ర కథపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర కథ గురించి జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ డిజాస్టర్ చిత్రం యాక్షన్ రిప్లై నుంచి నాగ్ అశ్విన్ స్ఫూర్తి పొందినట్లు సమాచారం. 

బికినీ ధరించడంపై ఇలియానా హాట్ కామెంట్.. ప్యాంటు లేకుంటేనే హాయిగా ఉందట

యాక్షన్ రిప్లై చిత్రంలో ఐశ్వర్యారాయ్, అక్షయ్ కుమార్ జంటగా నటించారు. తన తల్లి దండ్రులు విడాకులు తీసుకోవడం ఇష్టం లేని కుర్రాడు టైం మెషిన్ ద్వారా కాలంలో ప్రయాణిస్తాడు. తన తల్లి దండ్రులు ప్రేమలో పడేలా చేస్తాడు. ఈ పాయింట్ ఆధారంగానే నాగ్ అశ్విన్ ప్రభాస్ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు టాక్. 

మూడో ప్రపంచ యుద్దాన్ని ఆపేందుకు, వినాశనాన్ని నిర్మూలించేందుకు ప్రభాస్ ఈ చిత్రంలో కాలంలో ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఏ చిత్రంలోని టచ్ చేయని పాయింట్ ఇది అవుతుందని నా జి అశ్విన్ తన స్క్రిప్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.