పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథలతో చిత్రాలు తెరకెక్కించే క్రిష్ దర్శత్వంలో కూడా పవన్ నటిస్తున్నాడు. క్రిష్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. 

ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కథ కావడంతో క్రిష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ఒక్కో విశేషం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రంలో పవన్ దొంగగా నటిస్తున్నాడని.. దొంగిలించిన సొత్తుని పేదలకు పంచే మంచి దొంగగా పవన్ పాత్ర ఉండనున్నట్లు తెలిసింది. 

అల్లు అర్జున్ సినిమా చూశా.. నేను తప్ప ఇంకొకరు చేయకూడదు.. బాలీవుడ్ హీరో

అలాగే కోహినూర్ డైమండ్ ని దొంగిలించే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని టాక్. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మతిపోగోట్టే విధంగా ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉందని అంటున్నారు. పవన్ పాత్ర ఇంటర్వెల్ వరకు రెండు షేడ్స్ లో ఉంటుందట. ఒక పాత్రలో పవన్ మంచివాడిగా.. మరో పాత్రలో దొంగగా నటిస్తాడట. 

ఒక్కడే రెండు విధాలుగా నటిస్తున్నాడా లేక డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడా అనేది ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు రివీల్ కానున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.