తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు ఇళయదళపతి విజయ్. ఇటీవల విజయ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. మెర్సల్, సర్కార్, తేరి, బిగిల్ లాంటి వరుస విజయాలు విజయ్ సొంతం అయ్యాయి. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో మాస్టర్ చిత్రంలో నటిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా విజయ్ కుటుంబంలో ప్రస్తుతం చిన్నపాటి ఆందోళన నెలకొంది. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ స్కూలింగ్ పూర్తి చేసుకున్నాడు. ఉన్నత విద్య కోసం జాసన్ ఇంకొన్ని రోజుల క్రితం కెనడాకు వెళ్ళాడు. అక్కడ జాసన్ ఫిలిం మేకింగ్ కోర్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

హైపర్ ఆదికి షాక్.. గర్ల్ ఫ్రెండ్ తరహాలో రొమాన్స్, తప్పుకోనున్న యంగ్ యాంకర్!

ఇంతలో కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. దీనితో ఎక్కడికఅక్కడ రవాణా వ్యవస్థ, జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం జాసన్ సంజయ్ కెనడాలోనే చిక్కుకు పోయాడు. కానీ కెనాడలో ప్రస్తుతం కరోనా పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ తమ బిడ్డ పరిస్థితిపై విజయ్ దంపతులు ఆందోళన చెందుతున్నారు. 

విజయ్ తన కొడుకుతో ఫోన్ లో సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి బయటకు రావద్దని.. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తన కొడుక్కి విజయ్ సూచనలు ఇస్తున్నాడట. 

ఇదిలా ఉండగా జాసన్ సంజయ్ సినీ రంగ ప్రవేశంపై విజయ్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే సంజయ్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాడు.