జబర్దస్త్ షోలో హైపర్ ఆది పేల్చే కామెడీ పంచ్ లకు మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు టివి షోలలో పాల్గొంటున్నాడు. బుల్లి తెరపై యాంకర్ జోడిలకు మంచి క్రేజ్ ఉంటుంది. సుధీర్ రష్మీ.. సుధీర్, విష్ణు ప్రియ జోడీలు బుల్లితెరపై తమదైన శైలిలో రొమాన్స్ పండించారు. 

హైపర్ ఆది కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. హైపర్ ఆది, యంగ్ యాంకర్ వర్షిణి ఢీ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రొమాన్స్ బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి రొమాన్స్ తో అనేక వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తరహాలో హైపర్ ఆది, వర్షిణి కెమిస్ట్రీ పండిస్తున్నారు. 


కానీ సడెన్ గా వర్షిణి హైపర్ ఆదికి హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఢీతో పాటు ఎలాంటి టివి షోలకు షూటింగ్స్ జరగడం లేదు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో షూటింగ్స్ మరికొంత కాలం ఆలస్యం కానున్నాయి. ఈ గ్యాప్ లో వర్షిణి పలు వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. 

నటనపై ఫోకస్ పెట్టేందుకు వర్షిణి టివి షోలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు టాక్. ఇదే కనుక నిజమైతే వర్షిణి, హైపర్ ఆది రొమాన్స్ కు బ్రేకులు పడ్డట్లే.