యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2001లో ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే సింహాద్రి, ఆది లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. రాజమౌళి దర్శత్వంలో నటించిన సింహాద్రి చిత్రం మాస్ లో ఎన్టీఆర్ క్రేజ్ ని విపరీతంగా పెంచేసింది. 

ఎన్టీఆర్ తన 18 ఏళ్ల కెరీర్ లో ఇప్పటివరకు 28 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్టీఆర్ కు 29వ మూవీ. ఎన్టీఆర్ ప్రతి ఏడాది ఒకటో రెండో చిత్రాలతో అభిమానులని ఆకరిస్తూనే ఉన్నాడు. కానీ 2009 సంవత్సరం ఎన్టీఆర్ కెరీర్ లో ఖాళీగా మిగిలిపోయింది. ఆ చిత్రం ఎన్టీఆర్ నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. 

ప్రస్తుతం 2019లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ నుంచి ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాలేదు. 2008లో ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం నిరాశపరిచింది. దీనితో ఎన్టీఆర్ కొంత గ్యాప్ తీసుకుని 2010లో వినాయక్ దర్శత్వంలో అదుర్స్ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. 

నయనతారపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. నచ్చినా నచ్చకున్నా అంతే!

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చివరగా నటించిన అరవింద సమేత చిత్రం గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీ అయిపోయాడు. దీనితో 2019లో ఎన్టీఆర్ నుంచి మరో మూవీ రావడం సాధ్యపడలేదు. మొత్తంగా 2009, 19 ఎన్టీఆర్ కెరీర్ లో ఖాళీగా మిగిలిపోయాయి. ఏడాది మొత్తం ఎన్టీఆర్ ని వెండితెరపై చూడకపోవడం ఫ్యాన్స్ కు నిరాశకలిగించే అంశమే. 

రకుల్ ఆశలు గల్లంతు చేసిన నిర్మాత.. ఐదేళ్ల కష్టం వృధా!

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం 2020 జులై 30న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.